Gold Price Today : భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వివాహాలు, శుభకార్యాలు, లేదా ఇతర వేడుకల సందర్భాలలో బంగారం కొనుగోలు చేయడం ఆచారంగా మారిపోయింది. మహిళలు బంగారు నగల్ని ధరించడం ద్వారా తమ అందాన్ని మరింత మెరుగుపరుచుకుంటారని నమ్ముతారు. ఈ కారణంగా శుభకార్యాల సమయంలో బంగారానికి డిమాండ్ మరింత పెరుగుతుంది.
ఇదిలా ఉండగా, బంగారం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా ఉపయోగపడుతోంది. గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్స్, డిజిటల్ గోల్డ్ వంటి రూపాల్లో బంగారంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. బంగారంతో పాటు వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది.
బంగారం ధరలపై ప్రభావం:
బంగారం ధరలు ప్రాంతాన్ని, స్థానిక పన్నులను, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాన్ని బట్టి మారుతుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో కూడా పెద్దగా మార్పులు లేవు. గత నాలుగు రోజులుగా తగ్గుతూ ఊరటనిచ్చిన బంగారం ధరలు, బుధవారం నాడు పెరిగాయి. ఇవాళ బుధవారం బంగారం ధర రూ. 120లు పెరిగింది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
ఢిల్లీ:
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹71,660
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹78,160
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కోల్‌కతా, చెన్నై, ముంబై, బెంగళూరు :
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹71,510
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹78,010
వెండి ధరలు:
హైదరాబాద్, కేరళ, చెన్నై:
కేజీ వెండి ధర: ₹99,900
ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబై:
కేజీ వెండి ధర: ₹92,400
బంగారం, వెండి ధరల అప్డేట్స్ కోసం:
మీరు ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే, 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు వెంటనే మెసేజ్ రూపంలో వివరాలు అందిస్తారు.
(గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.)