Site icon HashtagU Telugu

Gold Price Today: పసిడి ధరలకు రెక్కలు.. నేటి బంగారం, వెండి ధరలివే..!

Gold Price

Gold Price

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) వరుసగా రెండో రోజు పెరిగాయి. గురువారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,040గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,200కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (ఏప్రిల్ 27, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Blue Hole In Mexico: మెక్సికోలో 900 అడుగుల లోతైన “బ్లూ హోల్‌”.. అసలు బ్లూ హోల్ ఎలా ఏర్పడుతుందంటే..?

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,190గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,420 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,550గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,040 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,500 ఉండగా, ముంబైలో రూ.76,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, కోల్‌కతాలో రూ.76,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, కేరళలో రూ.80,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, విజయవాడలో రూ.80,200 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.