Site icon HashtagU Telugu

Gold and Silver Rates: భారీగా తగ్గిన బంగారం.. వెండి మాత్రం..?

Gold Rates

Gold Rates

పసిడి ప్రియులకు శుభ‌వార్త‌. అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుకుల కార‌ణంగా బంగారం ధరలలో మార్పులు, చేర్పులు ఉంటాయి. కొనుగోళ్లను బట్టి మాత్రమే కాకుండా మార్కెట్‌ను బట్టి బంగారం ధరల నిర్ణయం ఉంటుంది. అయితే దేశంలో ఈరోజు బంగారం ధరలు బాగా తగ్గాయి. ఈక్ర‌మంలో పది గ్రాముల బంగారం 510 రూపాయ‌లు తగ్గింది. మ‌రోవైపు వెండి ధ‌ర మాత్రం కిలోకు 1200 రూపాయ‌లు వ‌ర‌కు పెరిగింది. తాజా హైదరాబాద్‌లో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,300 రూపాయలు ఉండ‌గా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,510 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 800 నుంచి 1200 రూపాయలు పెరిగింది. దీంతో హైద‌రాబాద్‌లో ఈరోజు కిలో వెండి ధర 68,600 రూపాయలుగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 46,300 రూపాయ‌లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 50,510 రూపాయ‌లుగా ఉంది. కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర 46,300 రూపాయ‌లుగా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 50,510 రూపాయ‌లుగా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 46,300 రూపాయ‌లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 50,510 రూపాయ‌లుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,300 రూపాయ‌లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,510 రూపాయ‌లుగా ఉంది.