Site icon HashtagU Telugu

Jaipur : జైపూర్‌లోని యోజ‌న భ‌వ‌న్‌లో భారీగా న‌గ‌దు, బంగారం స్వాధీనం

Cash

Cash

జైపూర్‌లోని యోజన భవన్‌లో రూ.2.31 కోట్ల నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిపార్ట్‌మెంట్‌కు చెందిన 7-8 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐటీ డిపార్ట్‌మెంట్ అదనపు డైరెక్టర్ మహేష్ గుప్తా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం జైపూర్ నగర పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. జైపూర్‌లోని ప్రభుత్వ కార్యాలయ యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లోని అల్మారాలో ఉంచిన బ్యాగ్‌లో రూ. 2.31 కోట్లకు పైగా నగదు మరియు సుమారు 1 కిలోల బంగారు బిస్కెట్లు కనుగొనబడ్డాయని తెలిపారు. 102 CrPC కింద పోలీసులు ఈ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.