Site icon HashtagU Telugu

Hyderabad: రాత్రి 11 గంటల తర్వాత బయటకు వెళ్తున్నారా..!

Section 30 Of Police Act

Section 30 Of Police Act

Hyderabad: ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస హత్యలు చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 11.30 తరువాత లాఠీలకు పోలీసులు పని చెప్పనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడేది లేదంటూ పోలీసులు ఆకతాయిలకు వార్నింగ్ ఇస్తున్నారు. 11.30 తరువాత ఎవరైన గుమ్మిగూడితే, అలానే గొడవలు చేస్తుంటే లాఠీ ఛార్జీ చేయనున్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆదివారం రాత్రి నుంచి ఈ రూల్స్ ను నగర పోలీసులు అమలు చేయనున్నారు. పోలీసుల చర్యలకు ప్రజలు సహకరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల హైదరాబాద్ లో కేవలం రెండు రోజుల్లో 7 హత్యలు జరిగాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో హత్యలు జరిగినట్టు మీడియాలో పలు వార్తలొచ్చాయి. దీంతోశాంతి భద్రతలు లోపించినట్టు వార్తల వినిపించడంతో పోలీసులు అలర్ట్ అయి గస్తీని పెంచారు. దీంతో రాత్రి 11 గంటల తర్వాత పలు ప్రాంతాల్లో పోలీసింగ్ చేస్తున్నారు.