Site icon HashtagU Telugu

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉదృతంగా వ్యవహరిస్తున్న గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ?

Bhadrachalam Flod

Bhadrachalam Flod

దేశవ్యాప్తంగా ఉత్తరాది ప్రాంతాలలో భారీ అతి భారీ వర్షాలు కురవడంతో నదులు పొంగి పొర్లుతున్నాయి. అంతేకాకుండా ప్రమాదకర స్థాయిని దాటి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల లోని ఇల్లు మొత్తం నీట మునిగిపోయాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే అంతకంతకు వరద ఉధృతి పెరిగిపోతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈరోజు ఉదయం 10 గంటలకు నీటిమట్టం 41.3 అడుగులు దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. కుండపోత వర్షాలు భారీ వర్షాలు కారణంగా భద్రాచలంలోని రామాలయం పరిసరాల్లోకి వర్షపు నీరు చేరాయి. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరొకవైపు అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేసేసారు. ఇక గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. 24 గంటలు పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. భద్రత రూములను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నదీ ప్రవహిస్తున్న తీరు చూస్తుంటే ఈరోజు సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ ప్రియాంక తెలిపారు.

Bhadrachalam

ప్రజలకు ఏ ఒక్కరికి ప్రాణహాని కలుగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. వరద నీరు చేరేవరకు ఆగకుండా ముందుగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆమె ఆదేశించారు. అలాగే పొంగిపొర్లుతున్న వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు హెచ్చరించారు. జాలర్లు చాపల వేటకు వెళ్ళొద్దని పశువులను మేతకు వదలకుండా ఇంటి వద్ద ఉంచాలని ఆమె సూచించారు. ఇదొక ఎత్తు అయితే మరొకవైపు తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాలేశ్వరం త్రివేణి సంగమం అయిన గోదావరి ప్రాణహిత నదులు పరువళ్లు తొక్కుతున్నాయి.

Exit mobile version