గోదావరి (Godavari ) నది ఉగ్రరూపం దాల్చడంతో బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయ (Basara Temple) పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఆలయానికి సమీపంలోని దుకాణాలు, అతిథి గృహాలు (గెస్ట్ హౌస్‌లు) పూర్తిగా నీట మునిగాయి. ఈ పరిణామంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తూ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
IBM : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఏపీలో IBM సెంటర్స్
వరద ఉధృతికి వ్యాస మహర్షి దేవాలయాన్ని గోదావరి జలాలు తాకాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వరద ఉధృతి ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ భయంకరమైన పరిస్థితి దృష్ట్యా భక్తులు ఆలయ సందర్శనకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం బాసరలో ఉన్న పరిస్థితులను గమనించి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆలయ సందర్శనకు రావాలని అధికారులు కోరుతున్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.