Site icon HashtagU Telugu

Gobi Pakora: ఎంతో క్రిస్పీగా ఉండే గోబీ పకోడీ టేస్టీగా తయారు చేసుకోండిలా!

Mixcollage 07 Mar 2024 05 24 Pm 8397

Mixcollage 07 Mar 2024 05 24 Pm 8397

గోబీ పకోడీ.. ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ అనగానే చాలామందికి గోబినే గుర్తుకొస్తుంది. మరి ఈ గోబీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

శెనగ పిండి – ఒక కప్పు
కాలిఫ్లవర్ ముక్కలు- ఒక కప్పు
కారం – ఒక టీస్పూను
ఉప్పు – సరిపడినంత
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
నూనె – వేయించడానికి సరిపడా
పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూను

తయారీ విధానం :

ఇందుకోసం కాలిఫ్లవర్ ను చిన్న ముక్కలుగా విడదీసుకోవాలి. వేడి నీళ్లలో ఓ అయిదు నిమిషాలు ఉడికించుకోవాలి. నీళ్లు వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండి, ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు కలిపి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కాలిఫ్లవర్ ముక్కలు కూడా వేయాలి. ఇప్పడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయలి. నూనె వేడెక్కాక కాలిఫ్లవర్ ముక్కలు పకోడీల్లా వేయించుకోవాలి. బంగారం రంగులోకి మారాక తీసి ప్లేటులో వేసుకోవాలి.