ఉత్తర గోవా (Goa)లోని పెర్నెమ్‌లోని రిసార్ట్‌లోని సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగి ఒకరు మొదట డచ్ టూరిస్ట్‌ను వేధించాడని, ఆపై ఆమెని కత్తితో పొడిచాడని ఆరోపించారు. దీంతో పాటు పర్యాటకురాలిని రక్షించేందుకు వచ్చిన యువకుడిపై కూడా నిందితుడు కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ఉత్తర గోవాలోని ఓ రిసార్ట్‌లో అద్దెకు తీసుకున్న టెంట్‌లో బస చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ నిధిన్ వల్సన్ తెలిపారు. ఈ సమయంలో రిసార్ట్ ఉద్యోగి అభిషేక్ వర్మ టెంట్‌లోకి ప్రవేశించాడు.
బాధితురాలు భయంతో కేకలు వేయడంతో స్థానిక వ్యక్తి ఒకరు వచ్చి అతడిని అడ్డుకున్నారు. దీంతో అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి నిందితుడు కత్తితో అక్కడికి వచ్చాడు. డచ్ టూరిస్ట్, స్థానిక వ్యక్తిపై దాడి చేసాడు. ఇది గమనించిన స్థానిక సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు ఉత్తరాఖండ్‌కు చెందిన వాడని, గత రెండేళ్లుగా అతడు అదే హోటల్‌లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Also Read: MLA Mekapati: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత
బాధితురాలు, స్థానికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు నిందితుడిపై సెక్షన్ 452, 354, 307, 506 (II) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.