317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. దానికి తాజా ఉదంతమే ఈ సంఘటన అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘బీంగల్ మండలం, బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య. అడ్డగోలు బదిలీతో మనస్థాపం చెంది సరస్వతి ఆత్మహత్య చేసుకున్నారు. 317 జీవో విడుదలైన దగ్గర నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడితో గుండె ఆగితుంది, బలవన్మరణానికి ఒడిగట్టో ప్రాణాలు వదులుతున్నారు.
ఉద్యోగుల కేటాయింపు, బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో ఉంది. ఈ చావులకు ప్రభుత్వమే కాదు… వాళ్లకు వత్తాసు పలికే ఉద్యోగసంఘాలు కూడా బాధ్యులే! 317 జీవో రద్దు కోసం ప్రభుత్వం పై పోరాడుదాం. ఉద్యోగులు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు తీసుకోవద్దు’’ అని రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో, 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోంది.దానికి తాజా ఉదంతం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య.
ఉద్యోగుల కేటాయింపు,బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో ఉంది.
317 జీవో రద్దు కోసం ప్రభుత్వం పై పోరాడుదాం. pic.twitter.com/EizGebVKcU— Revanth Reddy (@revanth_anumula) January 9, 2022