Site icon HashtagU Telugu

Global Investment Summit: త్వరలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్: కిషన్ రెడ్డి

Global Investment Summit

Global Investment Summit

Global Investment Summit:దేశంలో టూరిజం విభాగం అభివృద్ధి చెందడం వల్లే విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఐటీసీ కోహినూర్ హోటల్‌లో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం నెలకొల్పుతామని వివరించారు. పర్యాటక రంగం అభివృద్ధితో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ సదస్సులో పాల్గొంటారు.

Also Read:CM Vishnu Deo: ఛత్తీస్‌గఢ్‌ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవో