Site icon HashtagU Telugu

IPL 2022: RCBకి ఎదురుదెబ్బ

Glen Maxwell

Glen Maxwell

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌, ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ .. తన వివాహం కారణంగా మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం.. భారత సంతతికి చెందిన ఫార్మసిస్ట్‌ విని రామన్‌తో మార్చి 27న మెల్‌బోర్న్‌లో పూర్తిగా హిందూ సంప్రదాయ పద్దతిలో మ్యాక్స్‌వెల్‌ పెళ్లి జరగనుంది. ఎన్నారై యువతి విని రామన్‌ తల్లిదండ్రులు చాలా ఏళ్ళ క్రితమే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు .

అయితే, పెళ్లి కారణం గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడం ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు ..ఇక మార్చి ఆఖరి వారంలో ఆస్ట్రేలియా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనుంది.ఈ నేపథ్యంలో పెళ్లి కారణంగా మ్యాక్స్‌వెల్‌ ఈ పర్యటనకు కూడా అందుబాటులో ఉండనని ఇటీవలే ప్రకటించాడు.
ఇదిలాఉంటే.. ఐపీఎల్ 15 సీజన్ కు గాను బెంగళూరు ఫ్రాంచైజీ.. విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మహ్మద్ సిరాజ్‌ను రిటైన్ చేసుకుంది. వీరిలో విరాట్‌ కోహ్లికి అత్యధికంగా 15 కోట్లు వెచ్చించగా.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు రూ.11 కోట్లు, మహ్మద్ సిరాజ్‌కు రూ. 7 కోట్లు చెల్లించారు.. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌ ముంగిట ఆర్సీబీలోకి అడుగుపెట్టిన.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ బెంగళూరు , జట్టు ప్లే ఆఫ్స్ కు చేరడంలో ముఖ్య పాత్ర పోషించాడు.