Airport: ప్రయాణికుడి బ్యాగులో అలాంటి వస్తువు.. దెబ్బకు ఎయిర్ పోర్ట్ క్లోజ్.. అసలేం జరిగిందంటే?

సాధారణంగా మనం విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మనతోపాటు కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్తూ ఉంటాం.

  • Written By:
  • Publish Date - December 5, 2022 / 06:47 PM IST

సాధారణంగా మనం విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మనతోపాటు కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్తూ ఉంటాం. మనతో పాటుగా మనకు సంబంధించిన లగేజ్, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని తీసుకెళ్తూ ఉంటారు. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్లకూడదు అన్న విషయం తెలిసిందే. విమానంలో వస్తువులు ఏవైనా దొరికితే అటువంటి వ్యక్తులను వెంటనే అరెస్టు చేయడం లేదంటే విమానంలోకి ఎక్కకుండా వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత యధావిధిగా వారి పనులను కొనసాగిస్తూ ఉంటారు.

కానీ ఇక్కడ మాత్రం ఒక ఇప్పుడు బ్యాగులో ఒక అనుమానాస్పద వస్తువు దొరకడంతో ఏకంగా మొత్తం ఎయిర్ పోర్ట్ ని క్లోజ్ చేశారు. అసలేం జరిగింది?ఆ వ్యక్తి బ్యాగులు ఏముంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్కాట్లాండ్ లోని విమానాశ్రయంలో తాజాగా ఒక ప్రయాణికుడి బ్యాగులో అనుమానాస్పద ప్యాకేజీ కనిపించింది. ఆ వ్యక్తి వందలాది మంది ప్రయాణికులతో కలిసి ఎయిర్ పోర్ట్ లో చెకింగ్ తీసుకోవద్దు నిలబడి ఉన్నాడు. అప్పుడు విమానంలో వెళ్లాల్సిన మరి కొంతమంది ప్రయాణికులు కారు పార్కింగ్ స్థలంలోని నిలబడి ఉండాల్సి వచ్చింది. అప్పుడు విమానాశ్రయం లో సిబ్బంది లగేజీలపై దర్యాప్తును చేస్తున్నందున ఆలస్యం అవుతుందని ఎయిర్ పోర్ట్ అధికారి ప్రయాణికులకు వెల్లడించారు.

కాగా ఆ ప్రయాణకుడి లగేజ్ లో అనుమానాస్పద వస్తువు కారణంగానే సిబ్బంది మొత్తం ఆప్రమత్తమైనట్లు తెలిపారు. దాంతో పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది ఎయిర్ పోర్ట్ కి చేరుకోవడంతో మరి కొంతమంది ప్రయాణికులు పడిగాపులు కాయల్సి వచ్చింది. మరొక విమానాశ్రయానికి చేరుకునే లోపే ప్రయాణికుల రద్దీ ఎక్కువ అవ్వడంతో తనిఖీలు చేయడం మరింత ఆలస్యం అయ్యిందని, ఆ కారణంగానే తాము ముందు జాగ్రత్తగా టెర్మినల్ భవనాన్ని మూసి వేయడం జరిగింది అని ఎయిర్ పోర్ట్ అధికారి తెలిపారు. అంతేకానీ ఎయిర్ పోర్ట్ ను మొత్తం ఖాళీ చేయించలేదని ఆయన వెల్లడించారు.