HYD : ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి – సైబరాబాద్ పోలీసుల సూచన

నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు లేఖ రాశారు

Published By: HashtagU Telugu Desk
Workfromhome

Workfromhome

హైదరాబాద్ (Hyderabad) లో భారీ వర్షం (Rain) కురుస్తుంది. అర్థరాత్రి దాటిన తర్వాత కురిసిన వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. చాలాచోట్ల పది సెంటీమీటర్లకుపైనే వర్షం కురవడం తో ఇళ్లలోకి నీరుచేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జంట నగరాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్​లో భారీ వర్షాల దృష్ట్యా జలమండలి అప్రమత్తమైంది. జీఎం, డీజీఎం, మేనేజర్​తో జలమండలి ఎండీ జూమ్​లో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు జలమండలి ఎండీ సూచించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, గంటలు గడిచినా.. పునరుద్ధరించకపోవడంతో పలు చోట్ల ఇబ్బంది పడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు కంపెనీలకు సూచించారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు లేఖ రాశారు. నగరంలో వర్షం కారణంగా.. రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఎర్పడుతోంది. ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి కార్లు వినియోగిస్తారు కాబట్టి ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే.. ట్రాఫిక్ తగ్గి.. సహాయక చర్యలు తొందరగా చేపట్టే వీలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Read Also : Minister Ponguleti Injured : మంత్రి పొంగులేటికి గాయం..

  Last Updated: 02 Sep 2024, 01:07 PM IST