New Year Gifts 2023 : ఈ టెక్ గాడ్జెట్స్‌ ని న్యూ ఇయర్ గిఫ్ట్స్ గా ఇవ్వండి…

కొత్త సంవత్సరం కలిసి రావాలని కోరుకుంటూ చాలా మంది తమ ఆత్మీయులకు బహుమతులు (Gifts) అందజేస్తారు.

కొత్త సంవత్సరం (New Year) సందడి మొదలైపోయింది. అందరూ కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్నారు. చాలా మంది షాపింగ్‌లతో బిజీగా ఉన్నారు. కొత్త సంవత్సరం (New Year) కలిసి రావాలని కోరుకుంటూ చాలా మంది తమ ఆత్మీయులకు బహుమతులు (Gifts) అందజేస్తారు. గిఫ్ట్ ఎంపికలోనూ చాలా శ్రద్ద తీసుకుంటారు. వారి అభిరుచికి తగట్టు బహుమతులను సెలక్ట్‌ చేస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల గిఫ్ట్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే న్యూ ఇయర్ గిఫ్ట్స్‌గా గ్యాడ్జెట్స్‌ ఇద్దామని.. ప్లాన్‌ చేస్తున్న వాళ్లు. ఈ బెస్ట్‌ ఆప్షన్స్‌పై ఓ లుక్కేయండి..

Mi పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెసర్:

అడ్వెంచర్ రైడింగ్, ట్రావెల్‌ను ఇష్టపడే వారు మీకు స్నేహితులుగా ఉంటే, న్యూఇయర్ సందర్భంగా వారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ముందుగా వారి భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని గిఫ్ట్ ఎంపిక చేసుకోవడం బెటర్. పోర్టబుల్ ఎయిర్ ఇన్‌ఫ్లేటర్ అనేది లాంగ్ రోడ్ ట్రిప్‌లకు వెళ్లాలనుకునే వారికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ప్రస్తుతం Mi పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెసర్ అందుబాటు ధరలోనే లభిస్తుంది. కాబట్టి గిఫ్ట్ ఎంపిక‌లో ఇది మీ బెస్ట్ ఛాయిస్ కావచ్చు. ఇందులో ఐదు మోడ్స్ ఉంటాయి. మాన్యువల్ మోడ్, మోటార్‌సైకిల్ మోడ్, సైకిల్ మోడ్, బాల్ మోడ్, కార్ మోడ్. మీరు ఎక్కడికి వెళ్లినా దీన్ని తీసుకెళ్లడం చాలా సులభం.

 LG C2 OLED TV:

ఖరీదైన గిఫ్ట్ ఇచ్చేవాళ్లు.. స్మార్ట్‌టీవీని పరిశీలించవచ్చు. ప్రస్తుతం OLED టీవీల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. LG C2 టీవీ మీ అద్భుతమైన ఎంపిక కావచ్చు. ఇది రూ.2 లక్షల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. హై -పిక్చర్ క్వాలిటీ‌తో పాటు VRRకు సపోర్ట్ చేస్తుంది. 4K, 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంటర్నల్ గేమ్ ఆప్టిమైజర్ సెట్టింగ్ వంటి గేమింగ్-స్పెసిఫిక్ ఫీచర్స్‌తో ఇది లభిస్తుంది. ఇంట్లో ఉంటూ కంటెంట్‌ను చూడటం ఆనందించే ప్రియమైన వ్యక్తికి ఇది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది.

Nescafee- స్మార్ట్ కాఫీ మేకర్:

ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మందికి కాఫీ సొంతంగా ప్రిపేర్ చేసుకునే సమయం లేకనో లేదా చేయడం రాకనో బయట తాగుతుంటారు. ఇలాంటి వారికి నెస్‌కేఫ్ స్మార్ట్ కాఫీ మేకర్ వంటి గాడ్జెట్ బాగా ఉపయోగపడతాయి. వివిధ రకాల హాట్ కాఫీలను తయారు చేసుకోవచ్చు. దీన్ని బ్లూటూత్ సహాయంతో ఫోన్‌ ద్వారా రిమోట్‌గా కంట్రోల్‌ చేయవచ్చు. ఈ కాఫీ మేకర్ కేవలం 60-90 సెకన్లలో కాఫీని రెడీ చేస్తుంది. ఇది స్పిల్ ప్రూఫ్ మగ్‌తో వస్తుంది. ట్రావెల్‌లో సమయంలో కూడా దీన్ని సులభంగా క్యారీ చేయవచ్చు. న్యూయర్ సందర్భంగా ఈ కాఫీ మేకర్‌ను మీకు నచ్చిన వారికి గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.

గార్మిన్ ఫార్‌రన్నర్ 255:

ఫిట్నెస్‌ మీద ఫోకస్ పెట్టే వారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గార్మిన్ ఫార్ రన్నర్ 255 బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ స్మార్ట్‌వాచ్ అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో వర్కౌట్ ట్రాకింగ్‌ చేస్తుంది. సౌకర్యవంతమైన, తేలికపాటి డిజైన్ చూడటానికి ఇది స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తుంది.

Sony Inzone H9:

PC, PS5 గేమర్‌లకు బాగా సరిపోయే టాప్-ఆఫ్-ది-లైన్ గేమింగ్ హెడ్‌సెట్ ఇది. అత్యుత్తమ నాయిస్ క్యాన్సిలింగ్ టెక్నాలజీతో లభిస్తోంది.రిచ్ హైస్, మిడ్స్, విశాలమైన సౌండ్‌స్టేజ్, ఫ్రీక్వెన్సీలను తగ్గించని బాస్‌లతో స్పష్టమైన, అధిక-నాణ్యత సౌండ్‌ను డెలివరీ చేస్తుంది. ఇందులో సౌకర్యవంతమైన ఇయర్ కుషన్స్, హై-క్వాలిటీ ప్లాస్టిక్స్ ఉంటాయి. గేమర్ కోసం మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది మీ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.