Site icon HashtagU Telugu

Kejriwal : నాకు ఇంజక్షన్లు ఇవ్వండి…కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్‌ !

Untitled 1

Kejriwal judicial custody extended once again ody extension

Arvind Kejriwal: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో అరెస్ట‌యి తీహార్ జైలులో ఉన్న‌ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నార‌ని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈనేపధ్యంలో తాజాగా అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతున్న కారణంగా ఇంజక్షన్లు ఇవ్వాలంటూ రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

జైల్లో ఆయనకు షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతున్నాయి. దీంతో తనకు ఇంజక్షన్లు ఇవ్వాల్సిందిగా (provide insulin in jail) కోర్టును కేజ్రీవాల్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) వెల్లడించింది. కేజ్రీ పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనున్నట్లు తెలిపింది.

Read Also: YS Sharmila : ఏపీలో మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఉంది

కాగా, బెయిల్ కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా షుగర్ లెవల్స్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదనను తిప్పికొడుతూ.. డాక్టర్ సూచించిన టీ, స్వీట్‌ల కోసం ఎరిథ్రిటాల్ అనే స్వీటెనర్‌ను ఉపయోగిస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి గురువారం అన్నారు. గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్ 300కి చేరువలో ఉన్నప్పటికీ తీహార్ జైలు అధికారులు ఆయనకు ఇన్సులిన్ షాట్‌లు ఇవ్వకుండా చేస్తున్నారని అతిషి విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఇంట్లో వండిన ఆహారాన్ని నిరాకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.