America: కన్నీళ్లు పెట్టిస్తున్న చిన్నారి క్యాన్సర్ పెళ్లికూతురు కథ?

ఇటీవల కాలంలో చిన్నా పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ మహమ్మారి కారణంగా ఇప్పటికే చా

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 04:30 PM IST

ఇటీవల కాలంలో చిన్నా పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలామంది మరణించిన విషయం తెలిసిందే. క్యాన్సర్ కారణంగా ప్రతి ఏటా వందల మంది మరణిస్తున్నారు. అలా క్యాన్సర్ బారిన పడిన ఒక 11 ఏళ్ల బాలికకు సంబంధించిన ఒక కథ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన అమెరికాలోని నార్త్‌ కరొలినాలో చోటు చేసుకుంది. క్యాన్సర్‌ బాధిత బాలిక ఎమ్మా ఎడ్వర్డ్స్‌ అనే 11 ఏళ్ల బాలికకు డానియల్‌ మార్షల్‌ క్రిస్టోఫర్‌ డీజే విలియమ్స్‌ జూనియర్‌తో వివాహం జరిగింది.

ఎమ్మా లుకేమియా తోనూ బాధితురాలు. పెళ్లయిన 12వ రోజు ఆ బాలిక మృతి చెందింది. ఎమ్మా తల్లిదండ్రులకు తమ కుమార్తె లిమ్ఫోల్బా స్టిక్‌ లుకేమియా బాధితురాలని గత 2022లో తెలిసింది. ఇది క్యాన్సర్‌ మాదిరిగానే రక్తాన్ని, ఎముకలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి చిన్నారులకు సోకితే ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అయితే తమ కుమార్తె క్యాన్సర్‌ను జయిస్తుందని తల్లిదండ్రులు భావించారు. అయితే వారి ఆశ అడియాశగానే మిగిలిపోయింది. కుమార్తెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు క్యాన్సర్‌ ముదిరిపోయిందని, ఇక కొద్ది రోజుల మాత్రమే ఆమె బతికి ఉంటుందని వైద్యులు ఆ తల్లిదండ్రులకు తెలిపారు.

అదే సమయంలో ఆ చిన్నారి తన పెళ్లి కల గురించి తల్లిదండ్రులకు తెలిపింది. తాను డీజే ను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. దీంతో ఎమ్మా తల్లి డీజే తల్లిదండ్రులతో మాట్లాడి, వారిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేసింది. పెళ్లి మాటలు మాట్లాడుకున్న రెండు రోజులకే ఎమ్మా, డీజేలకు ఘనంగా వివాహం జరిగింది. ఒక రోజు ఆ చిన్నారి ఉన్నట్టుంది స్పృహతప్పి పడిపోయింది. తల్లిదండ్రులు వెంటనే బాధిత చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె కాలి ఎముకలకు కూడా ‍క్యాన్సర్‌ వ్యాపించిందని వైద్యులు తెలిపారు. ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. అలా అనే ఆఖరి కోరికను తీర్చుకొని ఆ చిన్నారి మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది సదరు బాలిక పరిస్థితి తెలుసుకొని కన్నీళ్లు పెడుతున్నారు.