Site icon HashtagU Telugu

Girl dies: బెంగళూరులో దారుణం.. టీచర్ దెబ్బలు తాళలేక బాలిక మృతి.!

Death Representative Pti

Death Representative Pti

బెంగళూరులోని ఓ పాఠశాలలో 9 ఏళ్ల బాలిక టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక మరణించిందని పోలీసులు ఆదివారం తెలిపారు. పాఠశాలలో తమ బిడ్డను కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టీచర్ బాలికను కొట్టి (శిక్షించడం)న కారణంగానే తమ చిన్నారి చనిపోయిందని కుటుంబీకులు ఆరోపించడంతో CRPC 174 కింద కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు. శనివారం పాఠశాలలో బాలిక అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు దగ్గరలోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి బాలికను చికిత్స నిమిత్తం తీసుకువెళ్లగా అప్పటికే బాలిక చనిపోయిందని డాక్టర్లు తెలిపినట్లు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ వినాయక్ పాటిల్ తెలిపారు.

బాలిక మృతికి కారణం అయిన పాఠశాల 4 లక్షలు నష్టపరిహారం ఇస్తామని చెప్పినట్లు మృతురాలి అమ్మమ్మ పేర్కొంది. 4 లక్షలు నష్టపరిహారం ఇస్తామని స్కూల్ వారు చెప్పారని, అయితే తనకు న్యాయం జరగాలని, డబ్బులు కాదు అని ఆమె అన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.