Road Accident : సంగారెడ్డిలో విషాదం.. బాలిక‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు

సంగారెడ్డిలో విషాదం నెల‌కొంది. ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి చెందింది. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Mexico Bus Crash

Road accident

సంగారెడ్డిలో విషాదం నెల‌కొంది. ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి చెందింది. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు చక్రాల కింద ప‌డిన బాలిక నుజ్జునుజ్జయింది. మృతి చెందిన బాలిక సంగారెడ్డి పట్టణానికి చెందిన తన్విగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులతో కలిసి మోపెడ్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వాహనం చక్రాల కింద పడి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె తల్లిదండ్రులు సురక్షితంగా బయటపడ్డారు. ఘ‌ట‌న‌పై సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

  Last Updated: 12 Jul 2022, 01:36 PM IST