India vs Sri Lanka: శతక్కొట్టిన కోహ్లీ, గిల్.. లంక ముందు భారీ లక్ష్యం..!

శ్రీలంకతో ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలో భార‌త జ‌ట్టు (India vs Sri Lanka) భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక బౌలర్లని టీమిండియా బ్యాట్స్ మెన్ ఓ ఆట ఆడుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు గిల్ (Gill), కోహ్లీ (Kohli) సెంచరీలతో చెలరేగారు.

Published By: HashtagU Telugu Desk
Gill, Kohli

Resizeimagesize (1280 X 720) (1) 11zon

శ్రీలంకతో ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలో భార‌త జ‌ట్టు (India vs Sri Lanka) భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక బౌలర్లని టీమిండియా బ్యాట్స్ మెన్ ఓ ఆట ఆడుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు గిల్ (Gill), కోహ్లీ (Kohli) సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 42 ప‌రుగులు, శుభమన్ గిల్ (116 పరుగులు) సెంచరీతో అదరగొట్టాడు. నువనిదు ఫెర్నాండోస్ వేసిన 31వ ఓవర్‌లో చివరి బంతికి శుభ్‌మన్ గిల్ సెంచరీ అందుకున్నాడు. 89 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సులతో మూడంకెల స్కోర్ సాధించాడు. అయితే గిల్‌కు వన్డేల్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.

Also Read: Ishan Kishan: జట్టులో చోటు దక్కని ఇషాన్ కిషన్.. బీసీసీఐపై విమర్శలు

రోహిత్ వికెట్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (166 నాటౌట్) మరో సెంచరీతో చెలరేగాడు. ఈ సెంచరీతో కోహ్లీ వన్డేలలో 46వ సెంచరీ సాధించాడు. శ్రేయాస్ అయ్యర్ (38 పరుగులు) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దింతో టీమిండియా నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసి శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమారా 2 వికెట్లు, రజిత 2 వికెట్లు, చమిక కరుణరత్నే ఒక వికెట్ తీసారు.

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు సచిన్ 18,426 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 14,234 పరుగులతో సంగక్కర రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.

  Last Updated: 15 Jan 2023, 09:53 PM IST