GHMC Helpline: నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుంపర్లతో కూడిన వర్షం పడుతుండటంతో పరిస్థితి అదుపులో ఉంది. కానీ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నాలుగైదు రోజులు వర్షప్రభావం ఉందనున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. అందులో భాగంగా జిహెచ్‌ఎంసి, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నగర ప్రజలకు నోటీసు జారీ చేసింది. పౌరులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా సహక చర్యలు పొందవచ్చు. లేకపోతే హెల్ప్ లైన్ నంబర్‌లు 91 90001 13667 లేదా 040-29555500కి ఫోన్ చేసి వర్షానికి సంబంధించిన సంఘటనలను నివేదించవచ్చు
నగరంలో కొద్దిపాటి వర్షానికే బీభత్సం జరుగుతుంది. రోడ్లన్నీ జలమయం అవుతాయి. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొంటుంది. వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే చెట్లు మరియు కొమ్మల గురించిన ఫిర్యాదులపై ప్రతిస్పందించడం, ప్రజలను, జంతువులను రక్షించడం, నీటి స్తబ్దతను నిర్వహించడం, వరదలు మరియు భవనాలు కూలిపోయినప్పుడు ప్రతిస్పందించడం, అగ్నిమాపక చర్యలు మరియు ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స చేయడంలో చురుకుగా పాల్గొంటున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.
Read More: YS Viveka Murder Case : సుప్రీంకోర్టులో వివేక హత్య కేసు విచారణ