Site icon HashtagU Telugu

GHMC Mayor: బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్

GHMC Mayor

Safeimagekit Resized Img (2) 11zon

GHMC Mayor: లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు బీఆర్ఎస్‌కు మ‌రో భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యే దానం, క‌డియం శ్రీహ‌రి, క‌డియం కావ్య‌, రాజ్య‌స‌భ సభ్యులు కె.కేశవరావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.

Also Read: Delhi Liquor Case : ఢిల్లీ మద్యం పాలసీ కేసు..మరో మంత్రికి ఈడీ నోటీసులు

2016లో తొలిసారి బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా గెలిచిన విజయలక్ష్మి.. 2021లో రెండోసారి గెలిచి మేయర్‌గా ఛాన్స్ కొట్టేశారు. బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న జీహెచ్‌ఎంసీ రీజియన్‌లో కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు గద్వాల విజయలక్ష్మిని పార్టీలో చేర్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఎవ‌రీ గద్వాల విజ‌య‌ల‌క్ష్మి..?

గద్వాల విజయలక్ష్మి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హైద‌రాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్‌గా 2021, ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టింది. ఆమె కె.కేశవరావు కూతురు. గద్వాల విజయలక్ష్మి హైద‌రాబాద్‌లోని హోలీ మేరీ స్కూల్‌లో పదవ తరగతి వరకు చ‌దివారు. రెడ్డి మహిళా కాలేజీలో డిగ్రీ, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం, సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. గద్వాల విజయలక్ష్మి 1988, డిసెంబరు‌ 24న గజ్వేల్‌కు చెందిన బాబిరెడ్డిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత విజయలక్ష్మి దంపతులు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. ఆమె అమెరికాలోని కరోలినా యూనివర్సిటీలో కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేసింది.

విజయలక్ష్మి దాదాపు 18 ఏళ్లపాటు తరువాత 2007లో భారత్ తిరిగి వచ్చింది. రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో ఆమె తన అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకుంది. 2016లో హైద‌రాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కి జరిగిన ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచింది. 2021లో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా రెండవసారి గెలిచి, మేయర్‌గా ఎన్నికైంది.

We’re now on WhatsApp : Click to Join