Site icon HashtagU Telugu

CIBIL Score: గూగుల్ పేలో ఉచితంగా సిబిల్ స్కోర్.. వివరాలివే?

Cibil Score

Cibil Score

సాధారణంగా సిబిల్‌ స్కోరు నివేదికను చూసి వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి ఒక అంచనా వేయచ్చన్న విషయం తెలిసిందే. బ్యాంకులు కూడా కొత్తగా అప్పు ఇచ్చే సమయంలో దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాయి. ఒకవేళ సిబిల్‌ స్కోరు కనుక 750 పాయింట్లకు మించి ఉంటే అది మీ ఆర్థిక క్రమ శిక్షణ బాగుందని అర్థం. కాగా ఇటీవల కాలంలో చాలా వెబ్‌సైట్లు, యాప్‌లు సిబిల్‌ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అందులో ఒకటి చాలా మంది తరచుగా ఉపయోగించే యాప్ గూగుల్‌ పే. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే..సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అని అర్థం.

ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. సిబిల్ వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ రుణ చరిత్ర నివేదిక, సిబిల్‌ స్కోర్ ను తయారుచేస్తుంది. సిబిల్‌ స్కోర్‌ 300- 900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే బ్యాడ్‌ సిబిల్‌ స్కోర్‌ గా పరిగణిస్తారు. అలాంటి వారికి రుణం రావడం అన్నది కష్టం.

అంతకంటె ఎక్కువ అంటే 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు. కాగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది గూగుల్‌ పే ని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదట్లో దీంట్లో కేవలం నగదు బదిలీకి మాత్రమే అవకాశం ఉండేది. కానీ దశలవారీగా అనేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లకూ దీన్ని విస్తరించారు. ఇటీవల సిబిల్‌ స్కోర్‌ను కూడా ఉచితంగా అందించడం ప్రారంభించారు.

అందుకోసం గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ పే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి, ఫోన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి గూగుల్‌ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి. తరువాత ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవుతూ బ్యాంక్‌ ఖాతాను గూగుల్‌ పే ఖాతాకు అనుసంధానం చేయాలి. డెబిట్‌/క్రెడిట్‌ కార్డును కూడా జత చేయవచ్చు. మీ గూగుల్‌ పే ఖాతా యాక్టివేట్‌ అవుతుంది. క్షణాల్లో మీ సిబిల్‌ స్కోర్‌ తెరపై కింద కనిపిస్తుంది. కింద కొన్ని సలహాలు, సూచనలు కూడా ఉంటాయి. గూగుల్‌ పేలో సిబిల్‌ స్కోర్‌ చెక్‌ చేసుకోవడం వల్ల మీ క్రెడిట్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.