Gayathri Jayanthi :ఆర్థిక కష్టాలు తీరాలంటే జూన్ 10న గాయత్రి జయంతి రోజున ఈ పని చేయండి..!!

  • Written By:
  • Publish Date - June 5, 2022 / 06:00 AM IST

హిందూ పురాణాల ప్రకారం, గాయత్రి మాత జ్యేష్ఠమాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున జన్మించింది. గాయత్రీ జయంతిని పవిత్ర పండుగను ప్రతిఏడాది జ్యేష్ట మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి అన్నిఏకాదశులలో కెళ్లా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. గాయంత్రీ జయంతి రోజున…గాయత్రిమాతను పూజిస్తే…అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.అయితే గాయత్రి జయంతి ఎప్పుడు వస్తుంది…పూజావిధానం, ప్రాముఖ్యత, శుభసమయం గురించి తెలుసుకుందాం.

గాయత్రి జయంతి తేదీ
ఈ సంవత్సరం గాయత్రి జయంతిని జూన్ 11, 2021 శనివారం జరుపుకుంటారు.

గాయత్రీ జయంతి ముహూర్తం
ఏకాదశి తిథి ప్రారంభం – జూన్ 10, 2022 ఉదయం 07:25 గంటలకు
ఏకాదశి తేదీ ముగుస్తుంది – జూన్ 11, 2022 ఉదయం 05:45 గంటలకు

గాయత్రీ జయంతి పూజ – విధానం
ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. తర్వాత ఇంట్లో దీపం వెలిగించాలి. గంగాజలంతో సకల దేవతలకు అభిషేకం నిర్వహించాలి. ఇప్పుడు మాత గాయత్రిని ధ్యానిస్తూ…గాయత్రీ మంత్రాన్ని జపించండి. అమ్మవారికి పూలు సమర్పిస్తూ… ఆ తల్లిని ఆరాధించండి. భగవంతునికి సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించబడుతాయని గుర్తుపెట్టుకోండి.

గాయత్రీ మంత్రం
‘ఓం భూర్భువ: స్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధ్యో యో న: ప్రచోదయాత్..