ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్, 2019, మే 30న ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంకా ఏడాది పాటు పదవీకాలం ఉండగానే, తాజాగా మూడు రోజుల క్రితం జగన్ సర్కార్ ఆయనను బదిలీ చేసింది. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. ప్రభుత్వ ఉద్యోగుల చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయిన నేపథ్యం, పోలిస్ బాస్‌గా ఆ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారనే కారణంతోనే సవాంగ్‌ను బదిలీ చేసినట్టు చర్చించుకుంటున్నారు.
123