Gowtham Ghattamaneni : తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్న గౌతమ్‌ ..

గౌతమ్‌ తరచుగా రెయిన్‌బో చిన్న పిల్లల ఆస్ప్రతికి వెళ్లి.. అక్కడి చిన్నారులను కలుస్తూ ఉంటాడు. రెయిన్‌బో చిన్న పిల్లల ఆస్పత్రితో కలిసి ఎంబీ ఫౌండేషన్‌

Published By: HashtagU Telugu Desk
Gautam is in the same Mahesh route

Gautam is in the same Mahesh route

తెరపై హీరో అనిపించుకోవడం కాదు తెరవెనుక కూడా హీరో అనిపించుకున్నవాడే రియల్ హీరో. అలాంటి రియల్ హీరోలు చాల తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ఒకరు. టాలీవుడ్ లో అగ్ర హీరోగా రాణిస్తూ..కోట్లాది రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మహేష్..ఆ డబ్బుతో ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతూ వస్తున్నారు. ఎంబీ ఫౌండేషన్‌ (MB Foundation) పేరిట సాయం చేస్తున్న మహెష్.. ఇప్పటి వరకు వేలాదిమంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి వారికీ ప్రాణదానం చేసారు. ఇక తండ్రి బాటలోనే ఆయన కుమారుడు గౌతమ్ (Gowtham ), కూతురు సితార (Sithara) నడుస్తున్నారు. కూతురు సితార తన మొదటి యాడ్‌ రెమ్యూనరేషన్‌ను తండ్రి ఫౌండేషన్‌కు ఇవ్వగా..గౌతమ్‌ కూడా ఎంబీ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తాజాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆస్పత్రిలో ఓ బాలుడ్ని గౌతమ్‌ కలిసిన ఫొటోలవి. బాలుడు ఆస్పత్రి బెడ్‌పై ఉండగా.. గౌతమ్‌ పక్కన కుర్చీలో కూర్చుని బాలుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ కానుకను కూడా బాలుడికి అందించాడు. తర్వాత పిల్లల ఆరోగ్యం గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు. నమ్రత (Namrata) తన పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చింది..

Read Also: Naa Saami Ranga: నా సామి రంగ.. నాగార్జున మాస్ జాతర షురూ!

‘‘ గౌతమ్‌ తరచుగా రెయిన్‌బో చిన్న పిల్లల ఆస్ప్రతికి వెళ్లి.. అక్కడి చిన్నారులను కలుస్తూ ఉంటాడు. రెయిన్‌బో చిన్న పిల్లల ఆస్పత్రితో కలిసి ఎంబీ ఫౌండేషన్‌ చిన్న పిల్లలకు పునర్జన్మ ఇస్తోంది. గౌతమ్‌ కూడా మా ఫౌండేషన్‌లో భాగంగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఆంకాలజీ, కార్డియో వార్డులోని పిల్లలను కలుస్తూ ఉంటాడు. వారితో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్లు త్వరగా కోలుకోవడానికి, సంతోషంగా ఉండటానికి వారితో కొంత సమయాన్ని గడుపుతూ ఉంటాడు. చిన్న పిల్లలు త్వరగా కోలుకునేలా.. వారి పెదాలపై నవ్వులు తీసుకువస్తున్నందుకు గౌతమ్‌కు కృతజ్ఞతలు’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.

  Last Updated: 29 Aug 2023, 12:35 PM IST