Site icon HashtagU Telugu

Gautam Gambhir: విరాట్ కోహ్లీపై గౌత‌మ్ గంభీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఏడాది అతడి బ్యాట్‌ నుంచి పెద్దగా పరుగులు రాలేదు. అయితే టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మాత్రం కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన చెందడం లేదు. కోహ్లీ పరుగుల కోసం ఆకలితో ఉన్నాడ‌ని, న్యూజిలాండ్ఆ.. స్ట్రేలియాపై అతను చాలా పరుగులు చేస్తాడ‌ని గంభీర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తన లయను కనుగొన్న తర్వాత విరాట్ పరుగుల పరంగా చాలా నిలకడగా నిరూపించుకోగలడని గంభీర్ అంగీకరించాడు.

గంభీర్ మాట్లాడుతూ.. విరాట్ గురించి నా అభిప్రాయాలు అతను ప్రపంచ స్థాయి క్రికెటర్ అని ఎల్లప్పుడూ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంత కాలం బాగానే ఆడాడు. అరంగేట్రం చేసిన సమయంలో ఎలాంటి పరుగుల ఆకలితో ఉన్నాడో ఇప్పటికీ అత‌ను అలాగే ఉన్నాడు. ఈ ప‌రుగ‌ల ఆక‌లి కోహ్లీని ప్రపంచ స్థాయికి చేర్చింది. అతను ఈ సిరీస్‌ల్లో పరుగులు చేయాలనుకుంటున్నాడని, ఆస్ట్రేలియాలో కూడా అదే ఆలోచనతో ఆడతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని గంభీర్ తెలిపారు.

Also Read: Lawrence Bishnoi : జైల్లో ఉన్నా వణుకు పుట్టిస్తున్న లారెన్స్‌ బిష్ణోయ్‌.. ఎవరు ?

ప్రతి మ్యాచ్ తర్వాత ఆటగాళ్లను అంచనా వేయలేం: గంభీర్

ఒక బ్యాడ్ మ్యాచ్ లేదా ఒక సిరీస్ ఆధారంగా ఆటగాడిని అంచనా వేయకూడదని గంభీర్ అన్నాడు. ప్రతి మ్యాచ్ తర్వాత ఆటగాళ్లను అంచనా వేయలేం. ప్రతి మ్యాచ్ తర్వాత మీరు ఆటగాళ్ల‌ను అంచనా వేస్తే అది వారికి మంచిది కాదు. ఇది ఒక గేమ్. ఆట‌గాళ్లు ఒక్కొక్క‌సారి విఫలమవుతుంటార‌ని గంభీర్ ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు.

అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని ఎంచుకోవడం నా పని: గంభీర్

ఆటగాళ్లను ఆదుకోవడంతోపాటు వారిలో విజయం సాధించాలనే కోరికను నింపడమే తన పని అని భారత మాజీ ఓపెనర్ చెప్పాడు. ‘ప్రతిరోజు అందరికీ మంచిగా ఉండ‌దు. మా ఆటగాళ్లకు మద్దతివ్వడమే మనకున్న వాతావరణం అని నేను భావిస్తున్నాను. ఆటగాళ్లను ఆదుకోవడమే నా పని. ప్లేయింగ్ ఎలెవన్‌లో అత్యుత్త‌మంగా రాణించేవారిని ఎంపిక చేసుకోవ‌డం నా బాధ్య‌త అని గంభీర్ ముగించారు.