Gautam Adani: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. శరద్ పవార్ ఇంట్లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య గంటలపాటు సంభాషణ జరిగింది. అయితే ఈ సమావేశానికి కారణాలు ఇంకా తెలియలేదు.
హిండెన్‌బర్గ్ నివేదికకు సంబంధించి గౌతమ్ అదానీకి శరద్ పవార్ మద్దతు ఇవ్వడం గమనార్హం. నిజానికి అదానీ కేసుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై విపక్షాలు కూడా పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించాయి. అయితే ప్రతిపక్షాల ఆరోపణను దాటవేస్తూ శరద్ పవార్ గౌతమ్ అదానీకి మద్దతు పలికారు.
హిండెన్‌బర్గ్ నివేదికపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో శరద్ పవార్ అదానీ గ్రూప్‌ను ప్రశంసించారు. ఈ విషయంలో ఎలాంటి విచారణ అవసరం లేదని శరద్ పవార్ కొద్ది రోజుల క్రితమే చెప్పారు. గతంలో కూడా ఇలాంటి అంశాలు లేవనెత్తారని, అయితే గతంలో కంటే ఈసారి ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పవార్ అన్నారు. అదానీ గ్రూప్‌ను అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ టార్గెట్ చేసిందని పవార్ ఆరోపించారు.
ఈ విషయంలో సుప్రీం కోర్టు వేసిన కమిటీని శరద్ పవార్ సమర్థించారు. కమిటీని ఎవరూ ప్రభావితం చేయలేరని అన్నారు. సుప్రీంకోర్టు కమిటీ విచారణ జరిపితే ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటకు వస్తాయని పవార్ చెప్పారు.
Read More: Rishi Sunak: భార్య అక్షత వ్యాపార వివరాలను పార్లమెంటులో ప్రకటించిన బ్రిటన్ ప్రధాని రిషి.. ఎందుకంటే?