Most Influential: ప్రపంచ ప్రభావంతుల జాబితాలో ‘అదానీ, కరుణ’

బిలియనీర్ గౌతమ్ అదానీ, న్యాయవాది కరుణ ప్రపంచ ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.

  • Written By:
  • Updated On - May 23, 2022 / 10:08 PM IST

టైమ్ మ్యాగజైన్ 2022లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో మనదేశం నుంచి బిలియనీర్ గౌతమ్ అదానీ, న్యాయవాది కరుణలకు చోటు దక్కింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్, టెన్నిస్ ఐకాన్ రాఫెల్ నాదల్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మీడియా దిగ్గజం ఓప్రా విన్‌ఫ్రే ఉన్నారు.

TIMEలో గౌతమ్ అదానీ ప్రొఫైల్ ఇలా ఉంది “ఒకప్పుడు ప్రాంతీయ వ్యాపారం చేసిన ఇప్పుడు విమానాశ్రయాలు, ప్రైవేట్ పోర్ట్ లు, సౌర థర్మల్ పవర్, వినియోగ వస్తువులతో తన వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరించాడు. అదానీ గ్రూప్ ఇప్పుడు ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక కరుణ ఆమె కేవలం న్యాయవాది మాత్రమే కాదు, “మార్పు తీసుకురావడానికి న్యాయస్థానం లోపల, వెలుపల తన స్వరాన్ని సమర్థంగా వాదించే ప్రజా కార్యకర్త. ఆమె సంస్కరణ కోసం వాదించిన మహిళా హక్కుల ఛాంపియన్. అత్యాచార నిరోధక చట్టాలు, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై పోరాడారు. తాజాగా, వైవాహిక అత్యాచారానికి చట్టపరమైన మినహాయింపును కలిగి ఉన్న భారతదేశంలోని రేప్ చట్టాన్ని సవాలు చేస్తూ ఆమె న్యాయపోరాటం చేస్తోంది.