నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని టీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని జేవార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గ్రేటర్ నోయిడా అడిషనల్ డీసీపీ దినేష్ కుమార్ మాట్లాడుతూ, “జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్‌పూర్ గ్రామంలోని టీ దుకాణంలో 5-లీటర్ గ్యాస్ సిలిండర్ పేలిందని.. ఇందులో దుకాణదారుడు అరవింద్‌తోపాటు మరో 8 మందికి కాలిన గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన వారందరినీ కైలాష్ ఆసుపత్రిలో చేర్పించామని.., వారి పరిస్థితి సాధారణంగా ఉందని ఏడీసీపీ తెలిపారు. క్షతగాత్రులలో ఒకరైన అరవింద్ తాత్కాలిక టీ దుకాణం నడుపుతుండగా, మరో 8 మంది కార్మికులు జేవార్ విమానాశ్రయంలో పనిచేస్తున్నారు.
9 Injured : నోయిడా ఎయిర్‌పోర్ట్ వద్ద పేలిన సిలిండర్.. 9 మందికి గాయాలు

Gas