Site icon HashtagU Telugu

YSRCP Leader Yarlagadda Venkatrao : ఆసుప్ర‌తిలో చేరిన వైసీపీ నేత యార్ల‌గ‌డ్డ‌… ఆందోళ‌న‌లో అనుచ‌రులు

Yarlagadda

Yarlagadda

గ‌న్న‌వ‌రం వైసీపీ నేత‌, మాజీ కేడీసీసీ బ్యాంక్ ఛైర్మ‌న్ య‌ర్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు మ‌రోసారి గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. గతంలో ఒకసారి స్ట్రోక్ రావడంతో ఒక స్టంట్ వేయ‌గా.. తాజాగా మ‌రో స్టెంట్ వేశారు. ఇటీవ‌ల‌ గన్నవరంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుల మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు వ‌చ్చాయి. వంశీ వైసీపీ లో చేరిన‌ప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో గొడ‌వ‌లు మ‌రింత పెరిగాయి. గ‌త వారం రోజుల క్రితం ఇరు వ‌ర్గాలు బాహాబాహికి దిగిన విష‌యం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వస్తుందో,రాదో అనే ఆందోళనలో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు ఉన్న‌ట్లు తెలుస్తోంది. యార్ల‌గ‌డ్డ‌కు గుండెపోటు వ‌చ్చింద‌న్న విషయం తెలుసుకొని ఆయ‌న అనుచ‌రులు హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు.