Site icon HashtagU Telugu

Ganja to Delhi: ఆంధ్రా నుంచి ఢిల్లీకి గంజాయి నెట్‌వర్క్

Ganja to Delhi

Ganja to Delhi

Ganja to Delhi: ఢిల్లీలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా రాకెట్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ రాకెట్‌కు సంబంధించిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 357 కిలోల గంజాయి(ganja)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1.78 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది.

ఢిల్లీ (delhi) పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అధికారుల ప్రకారం నిందితులు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి గంజాయిని తీసుకువచ్చి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో సరఫరా చేసేవారు. అరెస్టయిన నిందితులను ఒడిశాకు చెందిన సందీప్, జోగిందర్, నవీన్ కుమార్, రాజేష్‌లుగా గుర్తించారు ఈ డ్రగ్స్ రాకెట్ గురించి ఓ ఇన్‌ఫార్మర్ నుంచి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి సందీప్, జోగిందర్, నవీన్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 357 కిలోల గంజాయిని గుర్తించారు. దీనిపై పోలీసులు విచారించగా.. ఒడిశాకు చెందిన రాజేష్ చెల్లింపు కోసం ఢిల్లీకి వచ్చినట్లు గుర్తించారు. రాజేష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టయిన నిందితులు చాలా కాలంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఢిల్లీకి సరఫరా చేస్తున్నారు. ఈ రాకెట్‌లోని ఇతర సభ్యులు మరియు నెట్‌వర్క్‌లను కనుగొనడానికి పోలీసులు ఇప్పుడు దర్యాప్తులో బిజీగా ఉన్నారు

Also Read: India Beat Bangladesh: భారత్ విజయంపై కెప్టెన్ రోహిత్ బిగ్ స్టేట్మెంట్