Site icon HashtagU Telugu

Ganguly: పంత్ పురాగమనంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్… జట్టులోకి రీఎంట్రీ ఎప్పుడంటే?

Whatsapp Image 2023 02 27 At 22.16.19

Whatsapp Image 2023 02 27 At 22.16.19

Ganguly: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎప్పుడు కోలుకుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పంత్.. ప్రస్తుతం ఇంటి వద్ద ఉండి మెల్లమెల్లగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం కోలుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. త్వరలోనే ఐపీఎల్ ప్రారంభం కాబోతుండగా, ఇప్పటికే ఈ స్టార్ ప్లేయర్ తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రిషబ్ రీఎంట్రీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ పంత్‌తో టచ్‌లో ఉన్నానని చెప్పాడు. నేను అతనితో రెండు సార్లు మాట్లాడాను. సహజంగా అతను గాయాలు, శస్త్రచికిత్సల ద్వారా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాడు. నేను అతని క్షేమం కోరుకుంటున్నాను. పంత్ సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాలలో తిరిగి జట్టులోకి వస్తాడని తెలిపాడు.

పంత్ దాదాపు 6 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చని గత నెలలో నివేదికలు వచ్చాయి. పంత్ తిరిగి వచ్చే కచ్చితమైన తేదీ చెప్పకపోయినా వన్డే వరల్డ్ కప్‌ వరకు కోలుకుంటాడని అందరూ అనుకున్నారు. అయితే గంగూలీ చెప్పటం ప్రకారం పంత్ రెండేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌ మాత్రమే కాదు, వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ నుంచి కూడా తప్పుకుంటాడు.

ఢిల్లీ జట్టు పంత్ స్థానాన్ని ఇంకా ప్రకటించలేదు. యువ ఆటగాడు అభిషేక్ పోరెల్, అనుభవజ్ఞుడైన షెల్డన్ జాక్సన్‌లలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ బాధ్యతలు స్వీకరించగా వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరింనున్నాడు.