BRS Minister: కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా: గంగుల కమలాకర్

రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా తలపడాలి కానీ బండి సంజయ్ లాంటివారు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంభాన్ని వేదించాడని తీవ్రంగా ఆక్షేపించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో చేసిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గతంలో తన కుటుంభం ఊర్లో లేనప్పుడు, పిల్లలతో కలిసి దుబాయ్ లో ఉన్నప్పుడు తన ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి, ఇంటిని దౌర్జన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉందని సీబీఐ, ఈడీ, ఐటీలతో […]

Published By: HashtagU Telugu Desk
Minister Gangula Kamalakar Meeting with Millers association

Minister Gangula Kamalakar Meeting with Millers association

రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా తలపడాలి కానీ బండి సంజయ్ లాంటివారు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంభాన్ని వేదించాడని తీవ్రంగా ఆక్షేపించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో చేసిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గతంలో తన కుటుంభం ఊర్లో లేనప్పుడు, పిల్లలతో కలిసి దుబాయ్ లో ఉన్నప్పుడు తన ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి, ఇంటిని దౌర్జన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉందని సీబీఐ, ఈడీ, ఐటీలతో అహంకారంతో దుర్మార్గంగా దాడి చేయించారని, బాధతో నేడు ఆ విషయాన్ని చెపతున్నానన్నారు.

బండి లాంటి దుర్మార్గునికి, అవినీతి పరునికి ఓటేద్దామా అని ప్రశ్నించారు, ప్రజల నుండి వద్దు అని పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి, బండి సంజయ్ లాంటి ఎందరు కుయుక్తులు పన్నినా… తనను కడుపులో పెట్టుకొని కాపాడుతున్న కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, ఈ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు, మరింతగా కరీంనగర్ అభివ్రుద్దితో వారికి సేవ చేసుకుంటానన్నారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాకముందు 400 ఉన్న సిలిండర్ 1200 చేసారని, 200ల పించన్ 2016 చేసామని, రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత 5వేలు చేస్తామని, సౌభాగ్యలక్ష్మీ కింద 3000, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ 15లక్షలు, కేసీఆర్ బీమా ఇలా అనేక పథకాలు రాబోయే ప్రభుత్వంలో అందిస్తామన్నారు మంత్రి గంగుల.

  Last Updated: 24 Nov 2023, 03:50 PM IST