Site icon HashtagU Telugu

Nayeem case: నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్‌..!

Nayeem Seshanna

Nayeem Seshanna

Nayeem case: నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ టాస్కఫోర్స్ పోలీసుల‌ అదుపులో శేషన్న ఉన్నాడు. శేష‌న్న నుంచి పోలీసులు 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట‌లోని ఒక హోటల్‌లో సెటిల్‌మెంట్‌ చేస్తుండగా శేష‌న్న‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. శేష‌న్న‌ను నేడు కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.

2016 నయీం ఎన్‌కౌంటర్ తర్వాత శేష‌న్న‌ అజ్ఞాతంలోకి వెళ్లాడు. శేషన్నకు షాడో నయీం అని పేరు ఉంది. శేషన్న కనుసన్నల్లోనే నయీం యాక్షన్ టీం ఆపరేషన్స్ చేస్తోంది. నయీం డంప్ మొత్తం శేషన్న వద్ద ఉంది అని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. నయీం చేసిని అక్రమాల గురించి శేషన్న‌కు పూర్తి స‌మాచారం తెలుసు. శేష‌న్న అరెస్ట్‌తో నయీం విషయంలో వెలుగులోకి రాని మరిన్ని అంశాలు తెలిసే అవకాశం ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు. నయీంతో కలిసి హత్యలు, ఆయుధాలు, కబ్జాలు, సెటిల్మెంట్‌లు చేశాడు శేష‌న్న‌.

అతని దగ్గర 9ఎంఎం పిస్టల్‌ దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల దగ్గర ఉండే పిస్టల్‌ ఆయన దగ్గరకు ఎలా వెళ్లింది. ఆయనకు ఆశ్రయం కల్పించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేప‌ట్టారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించి కూడా శేషన్న నుంచి పలు వివరాలు సేకరించనున్నారు.

2016 ఆగస్ట్‌ 8న షాద్​నగర్ వద్ద జరిగిన ఎన్​కౌంటర్​లో నయూం మృతిచెందాడు. అనంతరం నార్సింగిలోని నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. త‌నిఖీల్లో భారీగా ఆస్తులు వెలుగు చూసిన విష‌యం తెలిసిందే.