Lawrence Bishnoi: గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న భయంకరమైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సెక్యూరిటీ కోసం ప్రతీ ఏడాది అక్షరాలా రూ. 40 లక్షలు ఖర్చవుతోందని తెలుసా? ఈ భారీ మొత్తాన్ని అతడి సొంత కుటుంబమే భద్రత కోసం వ్యయిస్తోంది. తాజాగా, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో మరోసారి లారెన్స్ బిష్ణోయ్ పేరు తెరపైకి వచ్చింది. లారెన్స్ భద్రతా కారణాల వల్ల సబర్మతి జైలులో ఉంచబడ్డాడు, కానీ జైలు గోడల వెనుక నుంచే అతను తన గ్యాంగ్‌ను నడుపుతున్నాడు. లారెన్స్ నేర సామ్రాజ్యం కెనడా వరకు విస్తరించిందని చెబుతున్నారు, అలాగే ముంబైలో దావూద్ గ్యాంగ్‌కు పోటీగా తన గ్యాంగ్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Pawan Kalyan : ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కళ్యాణ్ తీపి కబురు
లారెన్స్ బిష్ణోయ్ కుటుంబం ఆర్థికంగా బలమైనదని అతడి బంధువులు వెల్లడించారు. అతడి తండ్రి హర్యానాలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశారని తెలిపారు. కుటుంబానికి 110 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. లారెన్స్ పంజాబ్ యూనివర్సిటీలో న్యాయ విద్యను పూర్తిచేసాడు, కానీ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారతాడని కుటుంబ సభ్యులు ఊహించలేదు. అతడు ఎప్పుడూ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరిస్తుండేవాడని వారి మాటల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, లారెన్స్‌కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అతడి కుటుంబం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే వారు సంవత్సరానికి రూ. 40 లక్షలు భద్రతపై ఖర్చు చేస్తున్నారు.
బిష్ణోయ్ అసలు పేరు బాల్కరన్ బ్రార్. పాఠశాలలో ఉన్నప్పుడు అతను తన పేరును లారెన్స్ బిష్ణోయ్‌గా మార్చుకున్నాడు. యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలోనే అతని జీవితంలో మార్పు వచ్చింది. డీవీఏ కాలేజీ గ్యాంగ్‌వార్‌లో అతని ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేయడంతో, లారెన్స్ పూర్తిగా నేరపథంలోకి జారుకున్నాడు. 2018లో అతను తన అనుచరుడు సంపత్ నెహ్రాతో కలిసి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నాడు, దీని ద్వారా అతడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
Viral Video : యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ‘బాబా బాలక్ నాథ్’..?
జైల్లో ఉన్నప్పటికీ, లారెన్స్ తన నేర సామ్రాజ్యాన్ని అక్కడి నుంచే నడిపిస్తున్నాడు. పాపులర్ సింగర్ సిద్దూ మూసేవాలా , మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీపై దాడులకు అక్కడి నుంచే ఆదేశాలిచ్చాడు. బాబా సిద్దిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారు. సల్మాన్ ఖాన్‌ను అండగా నిలిచినందుకు కోపంతోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్దిఖీని హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.