Ganga Dussehra 2022: నేడు గంగా దసరా..ఇలా చేస్తే.. పాపాలకు మోక్షం లభిస్తుంది..!!

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలోని శుక్ల పక్షంలోని 10వ రోజున గంగా దసరా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ట శుక్లదశమి నాడు గంగాదేవి భూమి మీద అడుగుపెట్టింది.

  • Written By:
  • Updated On - June 9, 2022 / 09:43 AM IST

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలోని శుక్ల పక్షంలోని 10వ రోజున గంగా దసరా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ట శుక్లదశమి నాడు గంగాదేవి భూమి మీద అడుగుపెట్టింది. మహారాజ భగీరథుడు తన పూర్వీకులను రక్షించి, మోక్షాన్ని సాధించేందుకు తన కఠోర తపస్సు ద్వారా గంగను భూమిపైకి తీసుకువచ్చడాని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గంగా దసరా ఉత్సవాలు జూన్ 9వ తేదీ గురువారం నాడు ప్రారంభం కానున్నాయి.

ఈరోజున గంగానదిలో స్నానం చేస్తే పదిరకాల పాపాల నుంచి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఓ కథనం ప్రకారం ఈరోజు రామేశ్వరంలో రాముడు శివలింగాన్ని ప్రతిష్టించడాని నమ్ముతుంటారు. అందుకే ఈ రోజు గంగాదేవిని పూజించడం వల్ల పాపాల నుంచి విముక్తి లభించి మరణాంతరం మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్మకం. ఇప్పుడు గంగా దసరా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

2022 గంగామాత ఆథం నక్షత్రంలో చాంద్రమాన మాసంలోని 10వ రోజు భూమిపై కనిపించింది. ఈ సంవత్సరం గంగా దసరా శుభముహుర్తం జూన్ 9 ఉదయం 4:31లకు ప్రారంభమై జూన్ 10 తెల్లవారుజాము వరకు ఉంటుంది. గంగా దసరా రోజున ఉదయం నుంచి రవియోగం ప్రారంభం అవుతుంది.

ప్రాముఖ్యత…
గంగా దసరా రోజున గంగా నదిలో స్నానం చేస్తే…పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మనసు, శరీరం శుద్ధి అవుతుంది. ఈరోజున విష్ణుమూర్తి గంగానదిని పూజించడంలో ఆనందిస్తాడు. భక్తులకు అనుగ్రహం ఇస్తాడని చాలామంది నమ్ముతుంటారు. ఈ సందర్భంగా గంగాస్నానం చేయడం వల్ల మనిషికి మోక్షం లభిస్తుంది. మహారాజా భగీరథుడు తన పూర్వీకులను రక్షించేందుకు, మోక్షాన్ని సాధించేందుకు తన కఠోర తపస్సు ద్వారా గంగను భూమిపై తీసుకువచ్చాడని పురాణాల్లో ఉంది.

సందేశం…
గంగా దసరా స్వచ్చత సందేశాన్ని తెలయజేస్తుంది. మనకు నీరు చాలా ముఖ్యం. అది లేకుండా జీవితం ఊహించలేము. నదులు, ఇతర నీటి వనరులు కలుషితం చేయకూడదు. నీటిని వ్రుథా అనేది మీ భవిష్యత్తును ప్రమాదంలో నెట్టేస్తుంది.

పూజా విధానం…
గంగా దసరా పూజలు, దానధర్మాలలో 10సంఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గంగాదేవిని పూజించడానికి
పది పువ్వులు,
10 దీపాలు
10 పండ్లు
10 అగరబత్తీలు,
10 స్వీట్లు
వీటిని ఉపయోగిస్తారు. స్నానం, పూజ తర్వాత దానం చేయాల్సిన వస్తువులు పది ఉండాలి
10 బట్టలు,
10 ప్లేట్ల ఆహారం
10గొడుగులు
10రకాల స్వీట్లు
వీటన్నింటిని కూడా పదిమంది దానం చేయాలి. ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక గంగా దసరా సమయంలో గంగానదిలో స్నానం చేసేటప్పుడు కనీసం పది సార్లు మునిగి తేలాలి. ఇలా చేస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు.

పరిహారాలు..
గంగా దసరా రోజున గంగానదిలో స్నానం చేస్తే…ఎంతో పుణ్యం లభిస్తుందని భావిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ గంగలో స్నానం చేయలేరు. అలాంటప్పుడు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగా జలం కలిపి ఇంట్లోనే స్నానం చేయవచ్చు. మీ ఇంట్లో గంగాజలం చల్లుతే మంచిది. ఇక ఈ రోజు శివున్ని గంగాజలంతో అభిషేకం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం పెరుగుతుంది.

భవిష్యత్తు బాగుండాలని…
ఈరోజు కుండలను దానం చేస్తే…వ్యాపారంలో విజయం లభిస్తుంది. కూజాను దానం చేసేటప్పుడు దానిని నీటితో నింపి కొన్ని చుక్కల గంగా జలం వేయండి. దానిలో కొంచెం పంచదార కలపండి. దానం చేయండి. గంగా దసరా రోజు దానిమ్మ మొక్కను నాటితే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

రుణ విముక్తి కోసం….
అప్పుల నుంచి బయటపడలేకపోతే…వీటిని ప్రయత్నించవచ్చు. ఈ రోజున నల్ల దారాన్ని తీసుకుని…కొబ్బరికాయకు చుట్టండి. ఈ కొబ్బరికాయను పూజలో ఉంచి సాయంత్రం నీటిలో పోయాలి. ఇలా చేసి వెనక్కు తిరిగి చూడకూడదు. ఇంటికి తిరిగి వచ్చేయ్యండి. ఇలా చేస్తే అప్పుల నుంచి విముక్తి పొందవచ్చు.