Site icon HashtagU Telugu

Uttarakhand: ఉత్తరాఖండ్ ని ముంచెత్తుతున్న వరదలు.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్?

Uttarakhan

Uttarakhan

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో నదులు వాగులు, వంకలు ఉప్పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా కూడా వరద నీరే కనిపిస్తున్నాయి. మరొకవైపు ఢిల్లీలో యమునా నది ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తుంది. అది చాలాదన్నట్టు ఇప్పుడు ఉత్తరాఖండ్ లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఉత్తరాఖండ్ వాసులు బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. భారీ వర్షాల కారణంగా అలకనంద నదిపై ఉన్న జీబీకే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్ నిండడంతో దిగువకు నీటిని విడుదల చేశారు.

దాంతో దేవప్రయాగ వద్ద గంగానది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది.. ఇక హరిద్వార్ లో గంగా నది వార్నింగ్ స్థాయిని దాటి 293 మీటర్లను దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు నదీ పరివాహక ప్రాంతాలు అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు జారీ చేశారు. ఇప్పటికీ వరద ప్రభావం కారణంగా లోతట్టులో ప్రాంతాల్లో ఉన్న ప్రజలను శిబిరాలకు తరలించారు. హరిద్వార్, రూర్కి, ఖాన్పూర్, భగవాన్పూర్,లష్కర్ పరిధిలో ఉన్న అనే గ్రామాల్లోకి వరద నీరు చేరాయి. దీంతో జలదిగ్బంధం అయ్యింది. వరదల దాటికి ఇప్పటికే కొన్ని ఇల్లు నీట మునిగిపోయాయి. అక్కడ ప్రజలు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అంతేకాకుండా ఈ భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దానికి తోడు వరదలు ముంచేత్తుతుండడంతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. వర్షాలు వరదల కారణంగా 17 రోడ్లు తొమ్మిది వంతెనలు దెబ్బతిన్నాయి. ఇక మునుముందు ఇంకా భారీ వర్షాలు కురువనున్నట్లు అధికారులు అంచనా వేశారు. దాంతో ఉత్తరాఖండ్ లోని 13 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేశారు.