Site icon HashtagU Telugu

Jarkhand: భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారం..!!

Gang Raped

Gang Raped

ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా…మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదొక చోట ఆడది అవమానానికి గురవుతూనే ఉంది. అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు..ఇలా మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మరో దారుణం జరిగింది. భర్త ఎదుటే మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది.

పలామ జిల్లాలో ఓ వివాహిత అత్తగారింట్లో గొడవ పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ తల్లిగారింటికి వెళ్తుంది. ఆమె భర్త బంధువుతో కలిసి ఆమెను వెతకడానికి వెళ్లాడు. చికటిపడుతుండటంతో భార్యను ఇంటికి వెళ్దామని అడిగాడు. భార్య తాను రాలేనని భర్తతో వారించింది. ఈ క్రమంలో మూడు బైక్ లపై వెళ్తున్న ఆరుగురు వ్యక్తులు ఆమె భర్తపై దాడి చేశారు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా ఇతర ప్రాంతానికి మహిళను తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. దీంతో అక్కడికి స్థానికులు రావడంతో…మహిళ జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అనంతరం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version