Site icon HashtagU Telugu

Hyderabad : విదేశీ యువతిపై లైంగిక దాడి

హైదరాబాద్‌(Hyderabad)లో మరో దారుణం వెలుగు చూసింది. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఓ జర్మనీ యువతిపై లైంగిక దాడి(Se** assault on a young German woman)కి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో పర్యటన నిమిత్తం వచ్చిన ఓ విదేశీ యువతికి దుండగులు లిఫ్ట్ ఇస్తామంటూ తమ కారులో ఎక్కించుకున్నారు. మొదట ఆమె ఎక్కడికి వెళ్లాలో అక్కడ విడిచిపెడతామని నమ్మించిన నిందితులు.. అనంతరం కారును పహాడీషరీఫ్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

Imran Khan : నోబెల్‌శాంతి పురస్కారానికి ఇమ్రాన్‌ పేరు.. తెర వెనుక జెమీమా!

దాడి అనంతరం తీవ్ర భయంతో ఉన్న యువతి, స్థానికులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్ రిపోర్ట్ ఆధారంగా మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.

ఈ ఘటన నగరవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తోంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో విదేశీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతపై పోలీసులు మరింత దృష్టి పెట్టాలని, నిందితులను వెంటనే పట్టుకుని కఠినమైన శిక్షలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.