Madhya Pradesh: దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో భాజాపా నేత కుమారుడు?

దేశవ్యాప్తంగా స్త్రీలకు రక్షణ కరువయ్యింది. ఇంట బయట ఎక్కడ కూడా ఆడపిల్లలకు రక్షణ అన్నది పోతోంది. నిత్యం దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఆడవారిపై అ

  • Written By:
  • Publish Date - July 16, 2023 / 04:35 PM IST

దేశవ్యాప్తంగా స్త్రీలకు రక్షణ కరువయ్యింది. ఇంట బయట ఎక్కడ కూడా ఆడపిల్లలకు రక్షణ అన్నది పోతోంది. నిత్యం దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు మానభంగాలు, హత్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక ఘటన మరువక ముందే మరో ప్రదేశంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక యువతిపై ఏకంగా నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే.. ఒక బాలికను నలుగురి వ్యక్తులు కలసి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు.

వారిలో మైనర్లు కూడా ఉండడం ఆశ్చర్య పోవాల్సిన విషయం. ఈ ఘటన తర్వాత బాలిక ఆత్మహత్యకు పాల్పడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక బాలిక ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక యువకుడితోపాటు ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. అయితే, నిందితులందర్నీ అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధితుల బంధువులు, స్థానికులు పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిందితుల్లో భాజపా ఆఫీస్‌ బేరర్‌ కుమారుడి పేరు ఉండటంతో రాజకీయంగానూ ఇది సంచలనంగా మారింది. తనతోపాటు తన సోదరిని నలుగురు యువకులు అపహరించారని, అనంతరం ఒక ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ సోదరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తననూ కూడా లైంగికంగా వేధించారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు జిల్లా ఎస్పీ ప్రదీప్‌ శర్మ వెల్లడించారు.

అనంతరం ఇరువురు ఇంటికి చేరుకున్న తర్వాత బాధిత యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని అన్నారు. ప్రస్తుతం ఆమె ఝాన్సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, కాగా బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్యాంగ్‌రేప్‌, పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, నాలుగో వ్యక్తి ఆచూకీ చెప్పిన వారికి రూ.10వేల రివార్డును ప్రకటించామని అన్నారు. అయితే దీనిపై స్థానిక భాజపా కార్యవర్గం స్పందించింది. ఆ ఘటన దురదృష్టకరమని దతియా జిల్లా భాజపా అధ్యక్షుడు సురేంద్ర బుధోలియా పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ పార్టీ నేత కుమారుడి పేరు ఉన్నట్లయితే సదరు వ్యక్తికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని అన్నారు.