Site icon HashtagU Telugu

Gang Rape : మహారాష్ట్రలో దారుణం.. 12 గంట‌ల పాటు మైన‌ర్ బాలిక‌పై..?

Raped

Raped

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఓ మైనర్ బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు అత్యాచారం చేశారు.నిందితులపై సత్పతి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి.. ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నిందితులు బాలికను సముద్ర తీరానికి తీసుకెళ్లే ముందు ఓ బంగ్లాలో అత్యాచారం చేశారు. డిసెంబర్ 16 రాత్రి 8 గంటలకు బాధితురాలు త‌మ‌కు ఫిర్యాదు చేసిందని.. నిందితులు ఆమెను ఓ బంగ్లాకు తీసుకెళ్లారని త‌మ‌కు తెలిపింద‌ని పోలీసులు తెలిపారు. ఆ త‌రువాత ఆమెపై అత్యాచారం చేయడానికి వంతులవారీగా తీసుకువెళ్లారని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆదివారం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు.