Site icon HashtagU Telugu

Uppal: ప్రేమికులను వేధిస్తున్న ముఠా అరెస్ట్

Jail

951246 Raigad Jail Covid Maha

Uppal: ఉప్పల్ బాగాయత్  పోకిరిల ఆగడాలు శృతి మించితున్నాయి. రాత్రి వేళ బాగాయత్ కు వచ్చే జంటలను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక జంట నుండి మూడు లక్షలు డిమాండ్ చేసిన నిందితులు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే పోకిరిలతో ఎస్సై చేతులు కలిపారు. కంప్రమైస్ కావాలని ఫిర్యాదుదారులకు పోకిరిలను సూచించినట్టు సమాచారం.

దీంతో ఉన్నతధికారుల దృష్టికి తీసుకువెళ్లారు బాధితులు. నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై ను డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేసిన ఉన్నతధికారులు. నిందితుల్లో ఫీర్జాదిగూడ కార్పొరేటర్ సోదరుడు అమర్ ఉన్నారని తెలిపారు. 3లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై శంకర్ పై వేటు పడింది.