భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథులను నిమజ్జనం (Ganesh Nimajjanam Tank Bund) చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసరాలు గణేశ్ నిమజ్జనాలతో సందడిగా మారాయి. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి గణపతులు ఊరేగింపుగా ఇక్కడికి వస్తున్నారు. గణనాథుల నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలు పటిష్టమైన ఏర్పాట్లు చేశాయి.
AP Cabinet : యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం..ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య సేవలు
గణేశ్ నిమజ్జనం కోసం భక్తులు నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే వచ్చేందుకు అనుమతిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జనాల కోసం 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన సహాయం అందిస్తున్నారు. ఈ ఉత్సవాలతో నగరం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది.