Gandhi Hospital: పోయింది అనుకున్న కరోనా ముప్పు తన రూపం మార్చుకుని మళ్లీ వచ్చింది. కరోనా కొత్త వేరియంట్ JN.1 విజృంభిస్తోంది.. రెండు రోజులుగా కొత్త వేరియంట్ ప్రభావాన్ని చూపుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్లీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు మాట్లాడుతూ రోగులు ఎప్పుడు వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సాధారణ రోగులకు 30 పడకలు, గర్భిణులకు మరో 20 పడకలు కేటాయించారు. ఇప్పటి వరకు మాకు అలాంటి కేసులు రాలేదన్నారు.కొత్త రకం కరోనా లక్షణాలలో జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి మరియు తలనొప్పి లక్షణాలు ఉన్నాయి. కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రానున్న పండుగల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని కోరారు.
Also Read: Winter: మీరు కూడా చలికాలంలో అలాంటి వాటిని తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?