Site icon HashtagU Telugu

Sonia Gandhi Birthday: సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో 78 కేజీల కేక్ కట్ చేసిన సీఎం రేవంత్

Sonia Gandhi Birthday

Sonia Gandhi Birthday

Sonia Gandhi Birthday: కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ గాంధీ భవన్‌కు వచ్చారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు విహెచ్ తో కలిసి రేవంత్ 78 కేజీల కేక్ కట్ చేశారు. 6 హామీల్లో రెండు హామీలను సోనియా పుట్టిన రోజు నుంచే ప్రారంభించాలని నిర్ణయించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాలు, కష్టాలతో అధికారంలోకి వచ్చానని, వారి ఆశీస్సులతోనే అసెంబ్లీకి వెళ్తున్నానని రేవంత్ చెప్పారు.సోనియా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థించారు.

Also Read: India: దేశంలో ఒకే రోజులో 148 కొత్త కోవిడ్ కేసులు నమోదు