Galaxy S22: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-బుకింగ్ ఆఫర్…వీటిపై భారీ డిస్కౌంట్…!

దక్షిణకొరియా స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ప్రీ ఆర్డర్ లు వచ్చే వారం మనదేశంలో ప్రారంభించనుంది. గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ప్రీ బుకింగ్ చేసే కస్టమర్ల కోసం శాంసంగ్ కొత్త ఆఫర్లను వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
S22 Ultra Banner 3000x2000 Imresizer

S22 Ultra Banner 3000x2000 Imresizer

Samsung Galaxy S22 Series: దక్షిణకొరియా స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ప్రీ ఆర్డర్ లు వచ్చే వారం మనదేశంలో ప్రారంభించనుంది. గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ప్రీ బుకింగ్ చేసే కస్టమర్ల కోసం శాంసంగ్ కొత్త ఆఫర్లను వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ట్రూ వైర్ లెస్ స్టీరియో ఇయర్ బడ్స్ మరియు గెలాక్సీ వాచ్ 4 స్మార్ వాచ్ లపై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. ఫిబ్రవరి 9న జరిగిన గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8 సిరీస్ తోపాటు గెలాక్సీ ఎస్ 2, గెలాక్సీ ఎస్ 22ప్లస్, గెలాక్సీ ఎస్ 22 అల్ట్రాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇక మనదేశంలో గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ప్రీ ఆర్డర్ లు ఫిబ్రవరి 23నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. గెలాక్సీ ఎస్ 22, అల్ట్రా స్మార్ట్ పోన్ ప్రీ బుక్ చేసే కస్టమర్లకు రూ.26,999 వేల భారీ డిస్కౌంట్ ను పొందునున్నట్లు తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్వవాచ్ ను కేవలం రూ.2,999లకే అందించనుంది. దీంతోపాటుగా గెలాక్సీ ఎస్ 22, గెలాక్సీ ఎస్ 22 ప్లస్ మోడళ్లను ప్రీ ఆర్డర్ చేసిన కస్టమర్లకు గెలాక్సీ బడ్స్ 2 ఇయర్ బడ్స్ ను రూ.999లకు కొనుగోలు చేయవచ్చు.

వీటితోపాటుగా గెలాక్సీ ఎస్ మరియు గెలాక్సీ నోట్ సిరీస్ కస్టమర్ లు కూడా అప్ గ్రేడ్ బోనస్ ను పొందవచ్చు. లెటెస్టుగా గెలాక్సీ ఎస్ 22 సిరీస్ ను ప్రీ బుకింగ్ చేసినప్పుడు రూ. 8,000 బోనస్ పొందుతారు. ఇతర కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై రూ.5,000విలువైన క్యాష్ బ్యాక్ ఆఫర్ ను సొందవచ్చు. కస్టమర్లు శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ ద్వారా కూడా స్మార్ట్ ఫోన్లను కొనుగోలుచేయవచ్చని శాంసంగ్ కంపెనీ వెల్లడించింది.

ధర మరియు లభ్యత…
భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22, గెలాక్సీ ఎస్22ప్లస్, గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ధరల విషయానికొస్తే…8జిబీ, 128జిబీ ర్యామ్ తోపాటు స్టోరేజ్ మోడల్ కు రూ. 72,999. కాగా 8జీబీ, 256జీబీ మోడల్ ధర రూ. 76,999. గెలాక్సీ ఎస్ 22ప్లస్ ప్రారంభ ధర 84,999 రూపాయలు. హైఎండ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 12జిబీ, 256జిబి ర్యామ్ తో వస్తున్న స్టోరేజ్ మోడల్ 1,09,999 రూపాయలు. అయితే ఈ స్టోరేజీ మోడల్స్ ను కంపెనీ ఇంకా భారత్ లో ప్రారంభించలేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 సిరీస్ ప్రీ ఆర్డర్ కోసం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10 వరకు కంపెనీ ఆన్ లైన్ స్టోర్లు, రిటైల్ అవుట్ లెట్ లు, శాంసంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్లు, కంపెనీ ఆన్ లైన్ స్టోర్లతోపాటు అమోజాన్ లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

  Last Updated: 18 Feb 2022, 11:57 PM IST