హైదరాబాద్ (Hyderabad) లో వర్షం (Rains) పడిందంటే నగరవాసుల కష్టాలు అన్నీఇన్నీ కావు. అరగంట వర్షం పడితేనే నగరం అతలాకుతలం అవుతుంది..అదే 12 గంటల సేపు ఎడతెరిపి లేకుండా వర్షం పడితే ఇంకేముంది నీట మునకే. ప్రస్తుతం నగరంలోని చాల కాలనీలు అలాగే నీటిలోనే ఉన్నాయి. మొన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం అల్లాడిపోయింది. ఎక్కడిక్కడే వర్షపునీరుతో పలు కాలనీ లు నీటమునిగాయి.
ప్రస్తుతం హైదరాబాద్ లోని గాజుల రామారం (Gajularamaram) పరిస్థితి మరిదారుణంగా ఉంది. రెండు రోజులుగా కాలనీ లోని చాల ఇల్లులు నీట మునకలోనే ఉన్నాయి. త్రాగడానికి నీళ్ళు లేవు.. కనీసం కరెంట్ లేదని.. అధికారులు పట్టించుకోవడం లేదని.. మా సమస్యను పరిష్కరించాలని గాజుల రామారాం బాలాజీ లైన్ ఓక్షిట్ కాలనీ వాసులు సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నారు. వర్షం పడితే గాజుల రామారాం బాలాజీ లైన్ ఓక్షిట్ కాలనీ (Vokshith Enclave Gajulramaram)లో దయనీయ పరిస్తితి (Colonies Submerged With Flood Water) ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్లు ఎవరు లేరని కన్నీరుమున్నీరయ్యారు. రెండు రోజుల నుంచి నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, త్రాగడానికి నీళ్ళు (Drinking Water) లేక, కనీసం కరెంట్ లేక అల్లాడిపోతున్నామని.. మేము.. మా పిల్లాపాపలు.. ఇంట్లో వాళ్ళం, వృద్దులు, పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఎప్పుడు వర్షాలు పడినా ఇదే పరిస్థితి నెలకొంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : ఇదేందయ్యా ఇది.. చైనా వాల్ కి కన్నం పెట్టేసిన వ్యక్తులు.. చివరికి?
సూరారం & కపల చెరువు నుండి భారీగా నీరు దిగువున చేరడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాలనీలో అండర్ నాలా సంక్షన్ అయింది కానీ ఇంకా పనులు స్టార్ట్ కాలేదని, ఇంకా ఏడాది ఈ సమస్య ఇలాగే ఉంటుందని తెలిపారు. అధికారులు స్పందించి కాలనీలో అండర్ నాలా త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.