తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ మాజీ మంత్రి కుమార్ మధ్యాహ్నం 12.30 నుండి 12.40 గంటల మధ్య తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీఆర్‌ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టే సూచనలు లేనందున కుమార్ స్పీకర్‌గా ఎన్నిక కావడం లాంఛనమే కావచ్చు.
స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ తరుపున మద్దతు తెలుపుతున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతకం చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపారు. ఇక, కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుని మద్దతు ప్రకటించారు. అలాగే, ఎంఐఎం తరఫున మాజిద్ హుస్సేన్ మద్దతు తెలిపారు. గడ్డం వెంట కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
Also Read: Job Fair: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, తెలంగాణలో 2000 జాబ్స్ ఆఫర్!