Site icon HashtagU Telugu

Amshala Swamy Passes Away: ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్‌ దిగ్భ్రాంతి

KTR

Resizeimagesize (1280 X 720)

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్‌‌తో బాధపడుతున్న స్వామి(32) శనివారం ఉదయం మృతిచెందాడు. స్వామి (Amshala Swamy) మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ (IT Minister KTR) తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంశాల స్వామి మృతిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఫ్లోరోసిస్ బాదితుడై, వారికోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి అంశాలస్వామి. ఎంతో మందికి స్పూర్తి ఆయన. అంశాలస్వామి ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని అని కోరుకున్నారు.

Also Read: Former CM joins BRS: బీఆర్ఎస్‌లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్

 

గతేడాది.. ఫ్లోరైడ్ బాధితుడైన అంశాల స్వామి ఇంటికి కేటీఆర్ వెళ్లి ఆయనతో కలిసి భోజనం చేశారు. మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల సందర్భంగా మునుగోడు వెళ్లిన కేటీఆర్ ఆ తర్వాత శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామిని కలిసిన విషయం తెలిసిందే.